నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో “35-చిన్న కథ కాదు’ అనే సినిమా రూపొందింది ఈ సినిమాకి రానా దగ్గుబాటి ప్రెజెంటర్. కొత్త దర్శకుడు నంద కిషోర్ ఈమని తీసిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
“35-చిన్న కథ కాదు’ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద అద్భుతంగా నటించింది. ఆమె నటన ఆశ్చర్యపరిచింది. తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. సురేష్ ప్రొడక్షన్ తీసిన పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. అతని నటన కూడా సర్ ప్రైజ్ చేసింది. మీడియా కి థాంక్ యూ. ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్టార్స్ నేనెప్పుడూ చూడలేదు. చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నందు వలనే ఇది సాధ్యమైయింది,” అని అన్నారు రానా.
ఇక ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటానని రానా ప్రామిస్ చేశారు.
“నిన్న ఓ సింగిల్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి, చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్ లో సినిమా ప్లే చేసిన గొప్ప అనుభూతిని ఇచ్చింది. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది,” అని నివేద పేర్కొంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…