‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. సినిమాలో వెంకటేష్ కు భార్యగా నటించింది ఐశ్వర్య
ఈ పాత్ర కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు అనుకున్నాడట అనీల్ రావిపూడి. వాళ్లలో ఫైనల్ గా నిత్యామీనన్ ను, ఐశ్వర్య రాజేశ్ ను ఫైనల్ చేశారట. నిత్యామీనన్ అందుబాటులో లేకపోవడంతో, ఆ పాత్రకు ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారట.
ఆ పాత్రను ఐశ్వర్య రాజేష్ అంగీకరించడం చాలా గ్రేట్ అంటున్నాడు రావిపూడి. ఎందుకంటే, ఈ సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా కనిపిస్తుందంట ఐశ్వర్య. నెరేషన్ లో ఈ విషయం ఆమెకు చెప్పినప్పటికీ.. క్యారెక్టర్ బలంగా ఉండడంతో నటించడానికి ఐశ్వర్య రాజేష్ అంగీకరించిందంటున్నాడు.
‘గోదారి గట్టు’ పాటలో వెంకీ-ఐశ్వర్య కాంబినేషన్ ను చూసిన జనం.. వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ తో పోలుస్తున్నారని.. ఆ సాంగ్ హిట్టవ్వడం తన సినిమాకు ప్లస్ అయిందంటున్నాడు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…