తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లికి ప్రముఖలను నాగార్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లి పత్రిక అందచేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పత్రిక ఇచ్చారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు అక్కినేని నాగార్జున సీఎం చంద్రబాబుని కలిశారు. అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను, స్వీట్ బాక్స్ ని సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు.
అఖిల్ అక్కినేని ఈ నెల 5న పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా డేటింగ్ చేస్తోన్న జైనాబ్ రిజివితో అఖిల్ పెళ్లి జరుగనుంది. అఖిల్ కి ఇంతకుముందు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కానీ అది కొద్ధి రోజులకే రద్దయింది. ఇప్పుడు జైనాబ్ తో పెళ్ళికి అంతా సిద్ధం.
నాగార్జున స్వగృహంలో సింపుల్ గా పెళ్లి వేడుక జరగనుంది. మర్నాడు పెద్ద ఎత్తున వెడ్డింగ్ రిసెప్సన్ నిర్వహిస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…