ప్రస్తుతానికి తన ఫోకస్ మొత్తం డైరక్షన్ పైనే ఉందంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించాడు అనీల్ రావిపూడి. అదే టైమ్ లో నటనకు ఇంకా టైమ్ ఉందని కూడా చెబుతూ వస్తున్నాడు. ఎస్వీ కృష్ణారెడ్డి టైపులో దర్శకత్వంలో తనకంటూ ఓ మార్క్, ఇమేజ్ ఏర్పాటుచేసుకొని ఆ తర్వాత యాక్టింగ్ వైపు రావాలనేది రావిపూడి ఆలోచన.
అయితే తను హీరో పాత్రలు మాత్రం పోషించనని, కొన్ని క్యారెక్టర్ రోల్స్ మాత్రం చేయాలని ఉందంటూ ఇప్పటికే ప్రకటించిన ఈ దర్శకుడు.. తన యాక్టింగ్ కెరీర్ కు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
త్వరలోనే ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ పేరిట రాబోతున్న ఈ ప్రాజెక్టులో ఏదైనా మంచి వేషం ఉంటే ఇవ్వమని సందీప్ రెడ్డి వంగను కోరాడట అనీల్ రావిపూడి. దీనికి ఓ కారణం కూడా ఉంది.
ప్రభాస్ అంటే అనీల్ రావిపూడికి చాలా ఇష్టం అంట. అతడ్ని డైరక్ట్ చేస్తానో చేయనో తనకు తెలియదని, కానీ తను యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్లాలనుకుంటే మాత్రం ప్రభాస్ సినిమాను మించిన లాంఛ్ ప్యాడ్ ఇంకోటి లేదని అనీల్ ఫీలింగ్. అందుకే స్పిరిట్ లో చిన్న గెస్ట్ రోల్ చేస్తానని సందీప్ వంగాను కోరాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…