కొత్త మేనేజిమెంట్ పిచ్చి చేష్టల వల్ల టీవీ9ను వదిలేసి సాక్షి ఛానెల్ లో చేరిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన డిఫరెంట్ స్టయిల్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి.. “గరంగరం వార్తలు” అనే కార్యక్రమంతో సాక్షిలో ప్రత్యక్షమయ్యాడు.
ఈ కార్యక్రమం రూపురేఖలు ఎలా ఉంటాయి.. ఎవరెవరు ఉంటారు అనే విషయాల్ని ప్రారంభ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఈసారి శివజ్యోతి స్థానంలో ఓ కొత్త యాంకర్ ను తీసుకున్నారు.
శివజ్యోతి, సత్తిది సూపర్ హిట్ కాంబినేషన్. కానీ టీవీ9 నుంచి సత్తి బయటకు వచ్చినప్పటికీ.. శివజ్యోతి మాత్రం అక్కడే కొనసాగుతోంది. దీంతో తన కొత్త ప్రొగ్రామ్ కోసం వార్తల వాణి అనే కొత్తమ్మాయిని యాంకర్ గా పరిచయం చేస్తున్నాడు సత్తి. అంతేకాదు… దిల్ ఖుష్ దివ్య (ఇంతకుముందు టిక్ టాక్ స్టార్) అనే మరో అమ్మాయిని కూడా పరిచయం చేస్తున్నాడు. వాణి యాంకర్ గా, దివ్య రిపోర్టర్ గా కనిపించబోతున్నారు.
ప్రముఖ నటుడు తణికెళ్ల భరణి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…