న్యూస్

Dasara 2026: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్?

ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా డేట్ ప్రకటించారు. మరో సినిమాకి డేట్ లీక్ ఇచ్చారు. మొత్తంగా సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ పోటీ ఉండేలా ఉంది ఈ దసరాకి.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “జైలర్ 2” (Jailer 2) సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. తాజాగా ఒక వీడియో ద్వారా ఈ సినిమా డేట్ ని ప్రకటించారు. జైలర్ సినిమా సంచలనం సృష్టించింది. తమిళంలో, తెలుగులో ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా వస్తోన్న జైలర్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి.

నిజానికి ఈ సినిమాని మొదట ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత జూన్ లో వస్తుంది అని డేట్ ప్రకటించారు. అది మిస్ అయింది. ఫైనల్ గా అక్టోబర్ 15 అని డేట్ ప్రకటించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన “విశ్వంభర” (Vishwambhara) కూడా అక్టోబర్ 16న వచ్చేలా ఉంది. అధికారికంగా డేట్ ఇవ్వలేదు. కానీ టీం మీడియాకి అలా సమాచారం ఇచ్చింది. ఈ సినిమా కూడా అనేకసార్లు వాయిదా పడింది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదాపడి ఇప్పుడు దసరా పండగని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే జనం ఈ సినిమా గురించి మర్చిపోయారు. ఇంకా ఆలస్యం చేస్తే అస్సలుకే మోసం వస్తుంది.

TeluguCinema

Recent Posts

Nabha Natesh: ఒకటి ఇప్పుడు, ఇంకోటి ఎప్పుడు?

హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…

29 minutes ago

మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత

మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…

3 hours ago

ఇదే నా మొదటి సినిమా: Preity Mukhundhan

ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…

10 hours ago

Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…

23 hours ago

ఆ 15 నిమిషాల కోసం Nagabandham చేశాడంట!

'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…

24 hours ago

Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…

24 hours ago