సినిమా చూసి మంచి జడ్జిమెంట్ ఇస్తారని మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. ముఖ్యంగా ఒక సినిమా మాస్ కి పట్టేస్తుందా లేదా అనేది బాగా చెప్తారు అని అంటారు. “రంగస్థలం” సినిమా రిలీజ్ కి ముందే చూసి అది చరణ్ కెరీర్ లోనే పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పేశారు. అలాగే జరిగింది. అందుకే మెగాస్టార్ తన సినిమా గురించి ఏమి టాక్ చెప్తారో అని దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ఎదురుచూస్తున్నారు.
“చిరంజీవి గారు ఇంకా సినిమా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు,” అని అన్నారు బుచ్చిబాబు.
మీకు ఫైనల్ కాపీ చూసుకున్నాక ఎలా అనిపించింది, మీ గురువు సుకుమార్ ఏమి అన్నారు అని అడిగితే, బుచ్చిబాబు చెప్పిన సమాధానం: “నేను చూసుకున్నాక మంచి సినిమా తీశాననే ఫీలింగ్ కలిగింది. ఇక సుకుమార్ గారు . పెద్ది చూసిన తర్వాత సెకండాఫ్ తన ఫేవరెట్ అని చెప్పారు.”
పెద్ది సినిమా కథ 1985 నేపథ్యంగా విజయనగరంలో జరుగుతుందట.
“పెద్ది గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు… పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి,” అని చెప్పారు బుచ్చిబాబు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…