‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కొంతకాలంగా ఆగింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే వారం షూటింగ్ మొదలు కావొచ్చు. బన్నీ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వీలైనంత తొందరగా ఫినిష్ చెయ్యాలని భావిస్తున్నాడు దర్శకుడు సుకుమార్.
డిసెంబర్ 6న విడుదల కానుంది. ఇంకా 60 రోజులకు పైగా షూటింగ్ చెయ్యాలి. 60 రోజుల పని చెయ్యాలి అంటే దర్శకుడు సుకుమార్ కి మూడు నెలలకుపైగా పడుతుంది. అందుకే నిర్మాతలు కొంచెం కంగారు పడుతున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ తాజాగా శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నాడు. తన 12వ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు దేవరకొండ. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది.
వెంకటేష్, అనీల్ రావిపూడి సినిమా కూడా సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ పరిసరాల్లో తొలి షెడ్యూల్ జరుగుతోంది. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…