నిర్మాతగా మారి నిహారిక నిర్మించిన తొలి సినిమా “కమిటీ కుర్రాళ్లు”. ఈ సినిమా ప్రమోషన్ టైమ్ కు మెగా హీరోలెవ్వరూ అందుబాటులోకి రాలేదు. చిరంజీవి, రామ్ చరణ్ పారిస్ ఒలింపిక్స్ చూడ్డానికి వెళ్లారు. వదిన లావణ్య కాలిగాయంతో డెహ్రాడూన్ లో ఉంది. అన్నయ్య వరుణ్ తేజ్ వైజాగ్ లో షూటింగ్ లో బిజీ. చివరికి తండ్రి నాగబాబు కూడా దొరకడం లేదని బాధపడింది నిహా.
ఎట్టకేలకు ఆమెకు మద్దతుగా అందరూ తరలివచ్చారు. కమిటీ కుర్రాళ్లు ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వచ్చారు. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.
“కమిటీ కుర్రాళ్లు” సినిమాను అందరికంటే ముందు, ప్రత్యేకంగా వీక్షించారట చిరు. సినిమా చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అయిందంటున్నారు చిరు.
సినిమా చూసిన తర్వాత సినిమాకు అవార్డులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. మరి మెగాస్టార్ నమ్మకం నిజం అవుతుందా?
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…