న్యూస్

Ashu Reddy: కొన్ని గంటల్లో కేసుపై క్లారిటీ

ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది నటి, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి (Ashu Reddu). తనను దాదాపు 9 కోట్ల రూపాయలకు మోసం చేసిందంటూ, ఓ ఎన్నారై ఆమెపై కేసు పెట్టాడు. ఈ కేసు అక్రమంటూ ఆమె హైకోర్టు మెట్లు ఎక్కింది. దీనిపై మరికొన్ని గంటల్లో తీర్పు రానుంది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి దశలవారీగా తన నుంచి 9 కోట్ల రూపాయలకు పైగా అషు తీసుకుందని ఆరోపిస్తున్నాడు ఎన్నారై ధర్మేంధ్ర. అతడు ఇష్టపూర్వకంగానే తనకు డబ్బు ఇచ్చాడని అంటోంది అషూ. ఈ కేసును కొట్టేయాల్సిందిగా ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

మరోవైపు తన కేసుకు సంబంధించి తప్పుడు ప్రచారం జరగకుండా ఉండేందుకు ఆమె కోర్టు నుంచి రక్షణ పొందింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించింది. తప్పుడు కథనాలు రాసిన కొంతమంది వాటిని డిలీట్ చేశారని, ఇంకా ఎవరైనా ఉంటే తక్షణం తొలగించాలని ఆమె కోరింది.

ఈ గ్యాప్ అషు రెడ్డి కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వ్యవహారం నడిచింది. ఆమె మాట్లాడినట్టు చెప్పే ఆడియో టేపు ప్రత్యక్షమైంది. మరోవైపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా బయటకొచ్చాయి. వీటన్నింటిపై కొన్ని గంటల్లో కోర్టు పరిథిలో క్లారిటీ రానుంది. 

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

2 hours ago

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

2 hours ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

16 hours ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

23 hours ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

1 day ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

1 day ago