బన్నీ, కొరటాల మూవీ కథ ఇదేనా!

అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ కాంబినేషన్ పై ఎనౌన్స్ మెంట్ వస్తుందని నిన్నట్నుంచే అందరికీ తెలుసు. కాబట్టి చాలామందికి పెద్దగా సర్ ప్రైజ్ అనిపించలేదు. అయితే  ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందర్నీ ఆకర్షించిన ఎలిమెంట్.. కాన్సెప్ట్ పోస్టర్.

అవును.. బన్నీతో సినిమా కోసం కొరటాల శివ డిజైన్ చేయించిన కాన్సెప్ట్ పోస్టర్ అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది. క్లుప్తంగా చెప్పుకుంటే.. ఓ నదికి ఇటువైపు హీరో తన స్నేహితుడితో నిల్చొంటాడు. వీళ్ల వైపు అంతా చీకటి, ఓ తెప్ప, గుడ్డిదీపం, అన్నీ రాళ్లురప్పలు.

నదికి మరోవైపు మాత్రం అభివృద్ధి చెందిన నగరం కనిపిస్తుంది. రోడ్లు, విద్యుత్ దీపాలు, భారీ భవంతలు, సెల్ టవర్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ నగరం వైపు చూస్తూ నిల్చొనేలా ఈ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సందేశాత్మక సినిమాల్ని కమర్షియల్ గా తీయడంలో కొరటాల దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. బన్నీతో చేయబోయే సినిమాకు కూడా అలాంటి ఓ బలమైన సామాజిక అంశాన్నే కొరటాల సెలక్ట్ చేసుకున్నాడనే విషయం ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. ఒకప్పుడు రంగస్థలం సినిమాను ప్రకటించినప్పుడు ఆ కాన్సెప్ట్ పోస్టర్ పై ఎంత చర్చ నడిచిందో, ప్రస్తుతం బన్నీ-కొరటాల సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ పై కూడా అంతే డిస్కషన్ నడుస్తోంది.

TeluguCinema

Recent Posts

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

14 hours ago

వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?

మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…

15 hours ago

సోనీ లివ్లో భారీ ప్రాజెక్ట్‌ చెయ్యనున్న Samantha

సమంత (Samantha) ఇటీవలే పెద్ద హిట్ అందుకొన్నారు. మా ఇంటి బంగారం ఆమె ఖాతాలో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.…

16 hours ago

666 Operation Dream Theatre: టీజర్‌ విడుదల

'666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌' (666 Operation Dream Theatre) టీమ్‌ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో…

16 hours ago

Preity Zinta: ఈమె కూడా ఫేక్ వీడియోల బాధితురాలే!

నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి…

1 day ago

Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం

కెరీర్ లో ఎవరైనా ఒక పీరియడ్ సినిమా చేస్తారు, లేదంటే 2 చేస్తారు. కానీ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి వరుసగా అవే…

1 day ago