న్యూస్

Preity Zinta: ఈమె కూడా ఫేక్ వీడియోల బాధితురాలే!

నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి లేకుండా సృష్టించిన ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ ప్రీతి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘ప్రీతి జింటా వర్సెస్ గూగుల్’ పేరుతో ఈ కేసు నమోదైంది.

ఈరోజు ఈ కేసు విచారణకు రాగా, ఆన్‌లైన్ నుంచి ఈ ఏఐ కంటెంట్‌ను తొలగించడానికి ఒక విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ప్రక్రియపై అన్ని పార్టీలు సంయుక్తంగా పనిచేయాలని సూచిస్తూ, 6వ తేదీన తీర్పు ఇస్తామని వెల్లడించారు.

తన కేసులో గూగుల్ తో పాటు మెటా లాంటి సంస్థల్ని చేర్చింది ప్రీతి జింటా. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో తన ఏఐ డీప్ ఫేక్ వీడియోలు విపరీతంగా కనిపిస్తున్నాయని. కొంతమంది ఈ వీడియోలతో చాట్ బాట్ ఇంటరాక్షన్లు కూడా నిర్వహిస్తున్నారని కోర్టుకు తెలిపింది ప్రీతి జింటా.

రూల్స్ కు విరుద్ధంగా సోషల్ మీడియాలో చలామణి అవుతున్న తన ఏఐ కంటెంట్ ను తక్షణం డిలీట్ చేయాలని ఆమె కోరింది. ఈ మేరకు కొన్ని వెబ్ సైట్లను కూడా ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ వాదనలపై గూగుల్, మెటా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ, ప్రీతి జింటాకు చెందిన అసభ్యకరమైన ఏఐ మెటీరియల్ ను తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. అయితే, ఉల్లంఘనలు జరక్కముందే గుర్తించడం సాధ్యంకాదని, అంత టెక్నాలజీ తమ దగ్గర లేదని కోర్టుకు తెలిపారు. 

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్‌ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…

17 minutes ago

Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…

51 minutes ago

Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…

58 minutes ago

Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం

దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…

3 hours ago

OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…

3 hours ago

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

1 day ago