ప్రభాస్ సినిమాకు డేట్ ఫిక్స్…నిజమేనా?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమెరికాలో ఉన్నాడు. ఓవైపు బాహుబలి-2 సినిమాకు వస్తున్న ప్రశంసల్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రిలాక్స్ అవుతున్నాడు. పనిలోపనిగా తన కొత్త సినిమా కోసం అమెరికాలోనే మేకోవర్ అవుతున్నాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. సరే… ఈ పుకార్లను కాసేపు పక్కనపెడితే ప్రభాస్ అప్ కమింగ్ మూవీపై మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సాహో సినిమా వచ్చేనెల 10 నుంచి సెట్స్ పైకి వస్తుందట. మేటర్ ఇంకా కన్ ఫర్మ్ కాకపోయినా.. ప్రస్తుతానికి ఇది ఫైనల్ అంటున్నాడు దర్శకుడు సుజీత్. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు ప్రభాస్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే డేట్ లాక్ చేస్తామని అంటున్నాడు సుజీత్.

బాహుబలి-2 సినిమాతో పాటు రిలీజైన సాహో టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే ఊపులో సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది సాహో మూవీ.

TeluguCinema

Recent Posts

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

11 hours ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

11 hours ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

23 hours ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

1 day ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

1 day ago

Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…

1 day ago