టైటిల్ చూసి తప్పుగా అనుకోవద్దు. ఎప్పట్నుంచో మనసులో నిక్షిప్తంగా ఉండిపోయిన ఓ చిలిపి కోరికను తన తాజా సినిమాతో శర్వానంద్ తీర్చేసుకున్నాడు. అదేంటో తెలుసా.. ఫారిన్ లొకేషన్ లో సాంగ్ షూటింగ్. అవును.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మీరు నమ్మి తీరాల్సిందే.
కెరీర్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు శర్వానంద్. కానీ అతడి సినిమాలకు సంబంధించి ఏ ఒక్క సాంగ్ ఫారిన్ లొకేషన్ లో షూట్ జరుపుకోలేదు. అందుకే రాధ సినిమా కోసం పట్టుబట్టి మరీ ఫారిన్ వెళ్లాడు శర్వానంద్. అలా తెరకెక్కిందే రాబిట్ పిల్ల సాంగ్. ఈ పాటతో శర్వానంద్ చిలిపి కోరిక తీరిపోయింది.
శర్వానంద్ కు సంబంధించి శతమానంభవతి షూట్ మొత్తం ఇక్కడే జరిగింది. రన్ రాజా రన్ సినిమా కూడా ఇండియాలోనే తీశారు. అంతకుముందొచ్చిన “మళ్లీమళ్లీ ఇది రాని రోజు” సినిమాలో కొన్ని సన్నివేశాల్ని విదేశాల్లో తీసినా అందులో శర్వానంద్ లేడు. తాజాగా వచ్చిన రాధ సినిమాను కూడా ఇక్కడే కంప్లీట్ చేశారు. దాదాపు అన్ని పాటలు ఇక్కడే తీసేశారు. దీంతో తన కోరిక అలానే మిగిలిపోతుందేమో అనే భయంతో.. పట్టుబట్టి మరీ ఓ సాంగ్ కోసం ఫారిన్ వెళ్లాడు శర్వానంద్.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…