Dhurandhar Debuts on Netflix: ‘ధురంధర్’ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. వచ్చిన వెంటనే లక్షలమంది చూసేశారు. సోషల్ మీడియా నిండా ఆ సినిమా గురించి పోస్టులే. ఐతే, ఆ సినిమా గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. థియేటర్లో 3 గంటల 34 నిమిషాల నిడివి ఉంటే, నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా మూడు గంటల 21 నిమిషాల నిడివి మాత్రమే ఉంది అని కొందరు ఆరోపిస్తున్నారు.
అంతే కాదు, ఈ 9 నిమిషాల తగ్గింపులో చాలా కీలక సీన్లు పోయినట్లు కొందరు అంటున్నారు. మరికొందరు, థియేటర్లో ఈ సినిమా కలర్ టింట్ కి, నెట్ ఫ్లిక్స్ లో టింట్ కి తేడా ఉందని చెప్తున్నారు.
దాంతో, “ధురంధర్” టీం తాజాగా క్లారిటీ ఇచ్చింది. థియేటర్లో విడుదలైన వెర్షన్ కి, నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు ఉన్న వెర్షన్ కి ఏ మార్పు లేదు అని టీం తెలిపింది. ఒక్క సీన్ తొలగించలేదు, ఒక్క సీన్ చేర్చలేదు అని స్పష్టంగా చెప్తోంది.
“థియేటర్లో జనం ఏది ఐతే చూశారో, థియేటర్లో ఎలాంటి కలర్ టింట్ ఉందో అదే నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఇందులో ఈ మార్పు లేదు. 9 నిమిషాల నిడివి తగ్గింది అనుకోవడం కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్, యాడ్స్ వంటివి థియేటర్ వెర్షన్లో ఉంటాయి. అవి తొలగిస్తే కొంత నిడివి తగ్గుతుంది. అంతే కానీ, సినిమాలో మార్పు లేదు. ప్రతి సినిమాని ఓటిటిలో ప్రసారం చేస్తున్నప్పుడు, టైటిల్స్ కి ముందు వచ్చే కొన్ని కార్డ్స్, విరామం అని చూపే బ్యాంగ్ వంటివి తీసేస్తారు. అదే మార్పు, అంతే తప్ప మిగతా అంతా సేమ్,” అని టీం ప్రకటించింది.
ధురంధర్ సినిమాని ఆదిత్య ధార్ నిర్మించి, డైరెక్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. అక్షయ్ కన్నా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండియాలో దాదాపు 900 కోట్ల రూపాయల నెట్ పొందింది.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…