“సంక్రాంతికి వస్తున్నాం” సినిమా హిట్ కాగానే దిల్ రాజుకి ఎక్కడా లేని జోష్ వచ్చింది. మళ్ళీ భారీ భారీ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. కొన్నాళ్ల పాటు రాంగ్ రూట్లో వెళ్ళాను ఇక తప్పు తెలుసుకున్నాను అంటూ చెప్తున్నారు.
“మళ్లీ మా దారిలోకి వచ్చాం. గత నాలుగు ఐదు ఏళ్ళుగా మేం తడబడుతున్నాం. అనిల్ మళ్ళీ మాకు రూటు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో ఒక రహదారి వేసి ఇచ్చాడు అనిల్. మా సంస్థ నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఇది మాకు ఒక బిగ్ ఎనర్జీ. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది,” అని అన్నారు దిల్ రాజు.
ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి ‘గేమ్ చేంజర్’, రెండోది ‘సంక్రాంతికి వస్తున్నాం’. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ దారుణ పరాజయం పాలు అయింది. ఐతే, గత నాలుగేళ్లల్లో దిల్ రాజు చాలా ఫ్లాపులు చూశారు. కానీ రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ ని చాలా పర్సనల్ గా తీసుకొని ఏవేవో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
“శాకుంతలం” వంటి ఘోర ఫ్లాప్స్ చూసినప్పుడు కూడా తాను రూట్ మార్చాలని చెప్పలేదు.
మరి దిల్ రాజు మళ్ళీ కొత్త రూట్ లో ఎలాంటి సినిమాలు తీస్తారో చూడాలి. ఎలాగూ ఆయనకి ఇప్పుడు పెద్ద హీరోలు సినిమాలు చేసే పరిస్థితి లేదు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…