Categories: న్యూస్

ఆపాలనే ఆలోచన లేదు: తమన్న

హీరోయిన్ తమన్నా భాటియా టీనేజ్ లోనే నటించడం మొదలు పెట్టింది. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్ గా నటిస్తోంది. 18 ఏళ్ళ కెరీర్ పూర్తి అయింది. మరి బోర్ కొట్టడం లేదా? నటనకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పెళ్లి వరకు ఆగాలి అని భావిస్తోందా?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది తమన్న.

“నాకు నటన అంటే ఇష్టం. సినిమా షూటింగ్ కి వస్తేనే ఎనర్జీ వస్తుంది. పని లేకపోతే తోచదు. నటనకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచన ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. రాదు కూడా. పెళ్లి గురించి ఇప్పుడు ఏమి అడగొద్దు కానీ పెళ్ళికి, కెరీర్ కి సంబంధం లేదు. పెళ్లి చేసుకున్నా నటిస్తాను,” అనే క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అనేది టాక్.

మరోవైపు, తమన్న ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ సినిమాలో నటిస్తోంది.

Admin

Recent Posts

Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు

హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్…

2 hours ago

శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో Haiku, షూటింగ్ పూర్తి!

‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’…

2 hours ago

రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj

ఎప్పుడైతే పెళ్లి రద్దయిందో, ఆ వెంటనే దుబాయ్ నుంచి సౌతిండియాకు వచ్చేసింది హీరోయిన్ నివేత పెతురాజ్ (Nivetha Pethuraj). తన…

21 hours ago

OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…

1 day ago

Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్

బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…

1 day ago

The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…

2 days ago