Categories: న్యూస్

‘లవ్ గురు’ ఫ్యామిలీ టూర్ ఆఫర్!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ… “లవ్ గురు”. మంచి కలెక్షన్స్ అందుకుంటోంది ఈ మూవీ. ఈ సినిమాని మరింత విజయవంతం చేసేందుకు టీం ఒక కొత్త ఆఫర్ ని ప్రకటించింది.

“లవ్ గురు” సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో హీరో మలేసియాలో పనిచేస్తాడు. అందుకే ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియాని తీసుకెళ్తామంటున్నారు.

ఇక సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ని ప్రకటించింది “లవ్ గురు” టీమ్.

ఇవాళ్టి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. “లవ్ గురు” సినిమా చూసిన ప్రేక్షకులు పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్ కు మీ టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం “లవ్ గురు” సినిమా టీమ్ కల్పిస్తోంది.

“లవ్ గురు”లో విజయ్ ఆంటోని, మృణాళిని రవి జంటగా నటించగా..విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.

Admin

Recent Posts

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

10 hours ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

10 hours ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

11 hours ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

12 hours ago

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

15 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

2 days ago