న్యూస్

Jacqueline Fernandez: హీరోయిన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. సుఖేష్ నేర చరిత్ర గురించి తెలిసినప్పటికీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతని నుండి ఖరీదైన బహుమతులు పొందారని చెప్పడానికి ప్రాథమికంగా బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అక్రమ సంపాదనను దాచడంలో ఆమె సుఖేష్ చంద్రశేఖర్‌తో చేతులు కలిపారని కోర్టు అభిప్రాయపడింది.

మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్-3 కింద జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నేరానికి పాల్పడ్డారని, దీనికి సంబంధించి తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని జడ్జి స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీన నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా లేదా అని కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది.

సుఖేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి నిందితులు పింకీ ఇరానీ, లీపాక్షి ఎల్లావాడి ద్వారా బాగా తెలిసినప్పటికీ, జాక్వెలిన్ అతడి నుండి  రూ.5,71,11,942 విలువైన బహుమతులు స్వీకరించినట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా, ఆమె సోదరికి చెందిన విదేశీ బ్యాంక్ ఖాతాలోకి 1,72,913 యూఎస్ డాలర్లు, అలాగే ఆమె సోదరుడి విదేశీ బ్యాంక్ ఖాతాలోకి 26,740 ఆస్ట్రేలియన్ డాలర్లు బదిలీ అయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే జాక్వెలిన్, తన తల్లిదండ్రులకు కార్లు కొనుగోలు చేసినట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. తను కార్లు కొనుగోలు చేసిన విషయాన్ని జాక్వెలిన్ కూడా అంగీకరించినట్టు వెల్లడించారు. ఛార్జ్ షీట్ రెండో సప్లిపెంట్ లో జాక్వెలిన్ కు వ్యతిరేకంగా నమోదైన వ్యక్తుల స్టేట్ మెంట్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, కాల్ డేటాను కోర్టు పరిశీలించి, ఆమెపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.

TeluguCinema

Recent Posts

Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?

రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…

8 hours ago

ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3

సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…

16 hours ago

Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి

సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…

20 hours ago

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…

1 day ago

Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…

2 days ago

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…

2 days ago