ఫీచర్లు

Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ

2006 మే నెలలో బాక్సాఫీస్ (Boxoffice) బరిలో ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. విడుదలైన చిన్న తెలుగు చిత్రాలేవీ ఆడలేదు. మొత్తంగా 27 సినిమాలు రిలీజ్ అయితే ఒక్క హిట్ లేదు.

మే 1న ‘జెట్ లీ’, ‘గాయపడ్డ సింహం’, ‘పేట్రియాట్’, ‘ఓ తండ్రి కథ’, ‘రాజా శివాజీ’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ‘జెట్ లీ’, ‘గాయపడ్డ సింహం’ సినిమాలు ఓ మోస్తరు అంచనాలతో వచ్చినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాయి.

7-8 తేదీల్లో రవిబాబు చేసిన ‘రేజర్’, లావణ్య త్రిపాఠి నటించిన ‘సతీ లీలావతి’, ‘గోదారి గట్టుపైన’ సినిమాలొచ్చాయి. ఇవేవీ ఆడలేదు. వీటితో పాటు వచ్చిన ‘విధి గీసిన విచిత్రం’, ‘ఏ ఫిలిం బై గిరి’, ‘M4M’, ‘సూపర్ హీరోస్’ లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.

14-15 తేదీల్లో ‘వీరభద్రుడు’, ‘రాక్షసపురం’, ‘ముసలోడికి దసరా పండగ’, ‘హరుడు’, ‘వర్క్ ఫ్రం హోమ్’, ‘కేడీ’ సినిమాలొచ్చాయి. వీటిలో సూర్య నటించిన ‘వీరభద్రుడు’ తెలుగులో సో సో అనిపించుకొంది. తమిళంలో పెద్ద హిట్. తెలుగులో ఇటీవల కాలంలో సూర్యకి మంచి హిట్. కానీ బ్లాక్ బస్టర్ కాదు ఇక్కడ. మిగతా సినిమాలన్నీ పోయాయి.

21-22 తేదీల్లో నందు-అవికా కలిసి చేసిన ‘అగ్లీ స్టోరీ’, మోహన్ లాల్ చేసిన ‘దృశ్యం-3’తో పాటు ‘రమణి కల్యాణం’, ‘పురుషః’ సినిమాలొచ్చాయి. వీటిలోంచి కూడా ఏ ఒక్కటీ ఆకట్టుకోలేకపోయింది.

ఇక నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ‘త్రికాల’, ‘సందిగ్ధం’, ‘కాటాలన్’, ‘మరీచిక’, ‘బ్లాస్ట్ జోన్’ సినిమాలొచ్చాయి. ఇవన్నీ కూడా ఫ్లాపులే. రి-రిలీజ్ ల విషయానికొస్తే ‘నిన్ను కోరి’, ‘వన్-నేనొక్కడినే’, ‘అతిథి’, ‘దేవదాసు’ లాంటివి కూడా బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి

TeluguCinema

Recent Posts

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

4 hours ago

Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…

4 hours ago

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

15 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

24 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

1 day ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago