న్యూస్

Shivani Nagaram: తమిళ్లోకి ఎంట్రీ ఇస్తోంది

శివాని నాగారం (Shivani Nagaram) అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగులో సుహాస్ సరసన రెండు చిత్రాల్లో నటించింది. అలాగే గతేడాది విడుదలై మంచి హిట్ అయిన “లిటిల్ హార్ట్స్” (Little Hearts)లో కూడా నటించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ మన వాళ్ళు తెలుగు హీరోయిన్లకు అంతగా అవకాశాలు ఇవ్వరు కదా.

అందుకే ఈ భామ ఇప్పుడు తమిళ చిత్ర సీమపై ఫోకస్ పెట్టింది. యువ దర్శకుడు అభీషన్ జీవింత్ కొత్త చిత్రం ప్రకటించాడు. అతను ఇటీవలే హీరోగా “విత్ లవ్” అనే చిత్రంలో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభించాడు. ఇందులో  కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శివానికి ఛాన్స్ దొరికింది. యోగ లక్ష్మి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఐతే, శివానికి ఇది హీరోయిన్ గా తమిళంలో మంచి అరగేంట్రం అయ్యేలా ఉంది. 

పలువురు తెలుగు అమ్మాయిలు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి రాణించారు. బిందు మాధవి, శ్రీదివ్య, ఆనంది అలాగే కెరీర్ తీర్చిదిద్దుకున్నారు. ఇటీవల శ్రీ గౌరీ ప్రియ, శాన్వి మేఘన, మానస చౌదరి అలాగే తమిళంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే శివాని వెళ్తోంది.

TeluguCinema

Recent Posts

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

4 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

5 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

13 hours ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

18 hours ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

18 hours ago

Varun Tej ఖాతాలోనే మారుతి తదుపరి చిత్రం

దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…

18 hours ago