ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం… “శ్రీనివాస మంగాపురం”. ఈ సినిమా నుంచి అతని మొదటి లుక్ ఈ రోజు విడుదలైంది.
RX 100, మంగళవారం వంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకుడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న కొడుకైన జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జయ కృష్ణ దుమ్ము దూళి ఎగసే బ్యాక్ డ్రాప్ లో హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ కనిపించారు. ఒక చేత్తో బైక్‌ను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో గన్ టార్గెట్ గా పెట్టిన విధానం చూస్తుంటే ఇది యాక్షన్ సినిమా అనిపిస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాషా తడాని టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఆమె రవీనా తాండన్ కూతురు.
ఇక జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…