సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో కూడా ఊహించని వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు కాజల్ ది కూడా అదే బ్యాడ్ పొజిషన్.
రీసెంట్ గా కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది కాజల్. కొడుకు, భర్తతో కలిసి సాగరతీరంలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. పనిలోపనిగా కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.
ఆమె బీచ్ ఫొటోలకు లక్షల్లో లైకులొచ్చాయి. అలా మరోసారి కాజల్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అదే టైమ్ లో ఆమె ఫొటోలు వివాదాస్పదమయ్యాయి. దీనికి కారణఁ ‘కన్నప్ప’ సినిమా.
మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో ఆమె శివుడి భార్య పార్వతీ దేవి పాత్ర పోషించింది. ఇటు పార్వతి దేవి పాత్రలో ఆమె నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమౌతున్న వేళ.. బీచ్ లో ఆ డ్రెస్సుతో ఫొటోలు ఏంటంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బీచ్ లో ఆమె కాస్త పద్ధతిగానే కనిపించింది. టూ-పీస్ బికినీలో కనిపించినట్టయితే ఇంకెంత రచ్చ జరిగేదో.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…