కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ జింగుచా’ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు కమల్ హాసన్.
మణిరత్నం నిర్మించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పొన్నియిన్ సెల్వన్’ ను మొదట తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మించాలనుకున్నారు కమల్. కానీ అనుకోని కారణాల వల్ల మిస్సయిందంట. కట్ చేస్తే, ఈ సినిమా పార్ట్-1 దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రెండవ భాగం కూడా దాదాపు 350 కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది.
అలా తను 500 కోట్ల రూపాయల చిత్రాన్ని మిస్ చేసుకున్నానని అన్నారు కమల్. ఇక ‘థగ్ లైఫ్’ విషయానికొస్తే, ఈ సినిమా స్టోరీలైన్ ను మణిరత్నంకు ఇచ్చారంట కమల్. దాన్ని మణిరత్నం డెవలప్ చేశారంట.
అలా ‘థగ్ లైఫ్’ ప్రాజెక్టు సెట్ అయిందన్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని, కానీ ఒక్కరు కూడా తనకు ఐ లవ్ యు చెప్పలేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు లోకనాయకుడు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…