“భారతీయుడు – 2” ట్రయిలర్ లో తన గెటప్స్ తో పిచ్చెక్కించారు కమల్ హాసన్. సినిమాలో ఇలాంటి గెటప్స్ ఇంకా ఉన్నాయంటూ శంకర్ ఆల్రెడీ లీడ్ ఇచ్చేశాడు. “భారతీయుడు” మొదటి భాగంలో 2-3 గెటప్స్ లోనే మాత్రమే కనిపించిన కమల్, ఈ సీక్వెల్ లో మాత్రం తన నటవిశ్వరూపాన్ని చూపించేశారు.
ఈ మేకప్స్ కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు శంకర్. భారతీయుడు సినిమాలో ప్రోస్తటిక్స్ తో కేవలం 20 రోజులు మాత్రమే వర్క్ చేశారట కమల్. “భారతీయుడు-2” సినిమా కోసం మాత్రం ఆయన 70 రోజుల పాటు ప్రోస్తటిక్స్ పై వర్క్ చేయాల్సి వచ్చిందని, దీన్ని బట్టి సినిమాలో ఆయన ఎన్ని గెటప్స్ లో కనిపిస్తారో ఊహించుకోవచ్చని అన్నాడు.
సాధారణంగా ప్రోస్తటిక్స్ వేయడానికి 2 గంటలు పడుతుంది. కమల్ హాసన్ వేసుకున్న మేకప్ కు మాత్రం 3 గంటలు పట్టేదంట. షూటింగ్ పూర్తయిన తర్వాత అది తీసేయడానికి మరో 3 గంటల సమయం పట్టేదంట. ఈ మేకప్ కోసం అందరికంటే ముందుగా సెట్స్ పైకి కమల్ హాసన్ వచ్చేవారని, ప్యాకప్ చెప్పిన తర్వాత అందరికంటే లేటుగా సెట్స్ నుంచి వెళ్లేవారని అన్నాడు శంకర్.
ALSO READ: Bharateeyudu 2 Trailer – Tom and Jerry Game Begins
వచ్చే నెల 12న థియేటర్లలోకి వస్తోంది “భారతీయుడు-2” సినిమా. తాజాగా రిలీజైన ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు కొంత పెరిగాయి. ఇంకా చెప్పాలంటే, ఈ ట్రయిలర్ తోనే అసలైన బజ్ మొదలైంది.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…