కియరా అద్వానీ తల్లి కాబోతోంది. ఆమె ఇప్పుడు గర్భవతి. ఆమె, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తల్లితండ్రులు కాబోతున్నారు.
కియరా అద్వానీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఐతే, ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు, దాదాపు షూటింగ్ పూర్తి అయిన సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాల నుంచి తప్పుకొంది. త్వరలోనే మొదలు కావాల్సిన “డాన్ 3” సినిమాని వదులుకొంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోనున్నారు.
తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి కమిట్ కి రెడీ అయింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు. మరో రెండేళ్లు అంతే. బాబో, పాప పుట్టిన ఏడాది వరకు సినిమాలకు దూరంగానే ఉంటుందట. ఆ తర్వాత రీఎంట్రీ ఉంటుంది అని ఆమె టీం చెప్తోంది.
కియారా భర్త బాలీవుడ్ లో హీరోగా కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆమె భర్త కన్నా కియరానే నటిగా పాపులర్.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…