‘కుబేర’ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రన్ టైమ్ ఏకంగా 3 గంటల 15 నిమిషాల 27 సెకెన్లు ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇదంతా సినిమాలో కనిపించదు. దీనికి సంబంధించి నిర్మాత సునీల్ నారంగ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
ఆఖరి నిమిషంలో సెన్సార్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో, సెన్సార్ కాపీ సిద్ధం చేసి కాస్త ముందుగానే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేశారు. ఇప్పుడా 3 గంటల 15 నిమిషాల సినిమా నుంచి కొంత కట్ చేస్తారు.
మరి ఫైనల్ రన్ టైమ్ ఎంత ఉండొచ్చు. ‘కుబేర’ సినిమా 3 గంటల నిడివి దాటదనేది సునీల్ నారంగ్ మాట. అలా అని రెండున్నర గంటలు కూడా ఉండదంటున్నారు. ఇలాంటి కథను రెండున్నర గంటల్లో చెప్పలేమని కూడా చెబుతున్నారు.
సో.. ఫైనల్ వెర్షన్ లో ‘కుబేర’ సినిమా 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉండొచ్చనేది టాక్. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసింది. నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఇది శేఖర్ కమ్ముల సినిమా.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…