Categories: న్యూస్

నాకు లడ్డూ వద్దు: కార్తి

లడ్డూ కావాలా నాయనా అనేది ఫేమస్ డైలాగ్. కొన్ని ‘ప్రత్యేక’ సందర్భాల్లో ఈ డైలాగ్ చాలా పాపులర్. కార్తి హీరోగా నటించిన “సత్యం సుందరం” సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఈ డైలాగ్ వాడారు. దీని చుట్టూ చిన్న క్వశ్చన్ ప్లాన్ చేశారు. కానీ కార్తి మాత్రం సుతారంగా నో చెప్పాడు.

“ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. నాకు లడ్డూ వద్దు.” అంటూ స్పందించాడు కార్తి. సరదాగా స్పందించమని యాంకర్ కోరగా.. అస్సలు లడ్డూ వద్దు అంటూ కరాఖండిగా చెప్పేశాడు.

ప్రస్తుతం తిరుమల లడ్డూ చుట్టూ భయంకరమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, సౌత్ స్టేట్స్ అనే తేడా లేకుండా అందరూ తిరుమల లడ్డూపై స్పందిస్తున్నారు. ఏకంగా కేంద్రం కూడా ఈ వివాదంపై దృష్టి పెట్టింది. దీంతో లడ్డూ ఇష్యూ ఇప్పుడు జాతీయ అంశంగా మారింది.

ఇలాంటి సెన్సిటివ్ టైమ్ లో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్న అడగడంతో కార్తి స్పందించడానికి తిరస్కరించాడు. చూస్తుంటే, కార్తి కరెంట్ ఎఫైర్స్ బాగానే ఫాలో అవుతున్నారు.

Admin

Recent Posts

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

11 seconds ago

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

6 minutes ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

15 hours ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

21 hours ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

1 day ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

1 day ago