ఈ విషయం అందరికీ తెలిసిందే. నార్త్ మేకర్స్ స్లిమ్ గా ఉండే హీరోయిన్లను ఎంచుకుంటారు. అదే సౌత్ విషయానికొచ్చేసరికి హీరోయిన్ కాస్త కండపట్టి కనిపించాలి. అలాంటి ముద్దుగుమ్మలకే ఇటువైపు మొగ్గు. మరి ఒకే హీరోయిన్ అటు సౌత్ లో ఇటు నార్త్ లో రాణించాలంటే ఎలా? ఇది చాలా కష్టం అంటోంది హీరోయిన్ మాళవిక మోహనన్.
“కాస్త బరువు పెరిగిన తర్వాత ముంబయిలో సినిమా చేయడానికి వెళ్తే, మా మేనేజర్ ఒప్పుకోడు. వెంటనే స్లిమ్ అవ్వమని హెచ్చరిస్తాడు. స్లిమ్ అయిన తర్వాత చెన్నై వస్తే కష్టం అంటారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఈ టెన్షన్ నాకు ఎప్పుడూ ఉండేది.”
ఇలా హీరోయిన్ల శరీర సౌష్ఠవం వాళ్ల కెరీర్ కు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది మాళవిక. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆ పరిష్కార మార్గం కూడా మాళవిక చెబుతోంది.
ఇండస్ట్రీ ఏదైనా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండడం ముఖ్యమంటోంది మాళవిక. ఆరోగ్యంగా, ఫిట్ గా కనిపిస్తే ఆటోమేటిగ్గా అవకాశాలు వస్తాయని, అప్పుడిక భాషతో సంబంధం ఉండదని అసలు సీక్రెట్ బయటపెట్టింది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…