మంచు విష్ణు, మంచు మనోజ్ ఆ మధ్య కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. మీడియా సాక్షిగా వీరంగం వేశారు. తన అన్నని మనోజ్ “పం_ పి_లోడా” అని కూడా తిట్టడం అది వైరల్ కావడం జరిగింది. ఈ బూతు పదం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వాడుతున్నారు. ఇదే బూతు తాజాగా విడుదలైన “సింగిల్” సినిమాలో వినిపించింది.
ఇలా మనోజ్ నిజజీవితంలో తన అన్నని ఉద్దేశించి వాడిన బూతు పదాన్ని “సింగిల్” సినిమాలో హీరో శ్రీ విష్ణు యథేచ్ఛగా పలికాడు.
కానీ విడుదలకు ముందు మంచు విష్ణు “సింగిల్” సినిమా విషయంలో గొడవ చేశాడు. ఈ సినిమా ట్రైలర్లో వాడిన “మంచు కురిసిపోతుంది” అనే పదం తమ ఇంటిపేరుని ఒక బూతు మాటకు పర్యాయపదంగా వాడడం కరెక్ట్ కాదని ఈ సినిమా టీంతో వాదించాడు. దాంతో, హీరో శ్రీ విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అలాగే ట్రైలర్లో వాడిన ఆ డైలాగ్ ని సినిమాలో మార్చారు. “మంచు” స్థానంలో “మట్టి” అని వాడారు.
శ్రీవిష్ణు పట్టుబట్టి తన ఇంటి పేరుని బూతుగా వాడారని మార్పించుకున్నాడు కానీ మనోజ్ తనని తిట్టిన తిట్టుని సినిమాలో ఉంచారు అన్న విషయాన్నీ గ్రహించలేదు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…