‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా రా కింగ్ మనోజ్ మంచు (Manchu Manoj) మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు.
ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి “సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు, సంతోష్ భాయ్” అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు.
మనోజ్ మంచు మాట్లాడుతూ .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా మొదట సంప్రదించారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని, కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని సంప్రదించాను. వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాన’ని అన్నారు.
మానసిక స్థితి సరిగ్గా లేని నిరాశ్రయుల పరిస్థితి గురించి భావోద్వేగంతో మాట్లాడుతూ.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కనీసం అప్పుడప్పుడు మద్దతు, గుర్తింపు లభిస్తున్నప్పటికీ, ఇలా మానసిక స్థితి సరిగ్గా లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, దాదాపు అందరూ విస్మరిస్తూనే ఉంటారని మనోజ్ అన్నారు.
భవిష్యత్తులో కూడా ఐక్య ధైర్య సేనా సమితి ఈ ఆశ్రమానికి, దాని మానవతా కార్యక్రమాలకు సపోర్ట్‌గా ఉంటుందని గిరికి మనోజ్ హామీ ఇచ్చారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వారంతా చెట్ల కింద భోజనం చేయడం చూసి చలించిపోయిన మనోజ్ వీలైనంత త్వరగా ఆశ్రమానికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…