Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Manchu Manoj: సంతోష్‌కి పునర్జన్మ ఇచ్చిన ‘రా కింగ్’

TeluguCinema Team, May 26, 2026May 26, 2026
Manoj Manchu Restores Dignity to a Forgotten Life

‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా రా కింగ్ మనోజ్ మంచు (Manchu Manoj) మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు.

ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి “సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు, సంతోష్ భాయ్” అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు.

మనోజ్ మంచు మాట్లాడుతూ .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా మొదట సంప్రదించారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని, కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని సంప్రదించాను. వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాన’ని అన్నారు.

మానసిక స్థితి సరిగ్గా లేని నిరాశ్రయుల పరిస్థితి గురించి భావోద్వేగంతో మాట్లాడుతూ.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కనీసం అప్పుడప్పుడు మద్దతు, గుర్తింపు లభిస్తున్నప్పటికీ, ఇలా మానసిక స్థితి సరిగ్గా లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, దాదాపు అందరూ విస్మరిస్తూనే ఉంటారని మనోజ్ అన్నారు.

భవిష్యత్తులో కూడా ఐక్య ధైర్య సేనా సమితి ఈ ఆశ్రమానికి, దాని మానవతా కార్యక్రమాలకు సపోర్ట్‌గా ఉంటుందని గిరికి మనోజ్ హామీ ఇచ్చారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వారంతా చెట్ల కింద భోజనం చేయడం చూసి చలించిపోయిన మనోజ్ వీలైనంత త్వరగా ఆశ్రమానికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

Recent News

  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?
  • Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం
  • OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes