
నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితం, రిలేషన్ షిప్స్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
తన జీవితంలో ఇప్పటివరకు 3 బ్రేకప్స్ అయ్యాయని, అవన్నీ ఇరు పక్షాల పరస్పర అంగీకారంతోనే జరిగాయని చెప్పుకొచ్చింది కామాక్షి. ఏ బంధంలోనైనా కేవలం స్వార్థం చూసుకోకూడదని, అవతలి వ్యక్తి అంచనాలను, ఇష్టాలను గౌరవించాలన్నారు.
సమాజంలో శృంగారాన్ని బూతులా చూడటంపై కామాక్షి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. షేక్ హ్యాండ్ నుంచి సెక్స్ వరకు అన్నీ శారీరక, మానసిక ప్రక్రియలని అభిప్రాయపడింది. ఇద్దరు వ్యక్తులు తమ మనసులోని ఆలోచనలను పంచుకోవడాన్ని గొప్పగా చూసినప్పుడు, శారీరక కలయికను మాత్రం తప్పుగా లేదా బూతులా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నిస్తోంది.
చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసిన ఆమె, సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

‘మా ఊరి పొలిమేర’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి, ‘అగధ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తనను మరింత ముందుకు తీసుకెళ్తుందని చెబుతోంది.
ఈ స్థాయిలో కామాక్షి భాస్కర్ల బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె ధైర్యాన్ని, నిజాయితీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
