
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మరోసారి తన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 40 ఏళ్ల వయసు దాటినా, ఒక బిడ్డకు తల్లైనా, గ్లామర్ విషయంలో తాను ఏమాత్రం తగ్గలేదని ఆమె నిరూపిస్తోంది.
ఇటీవల ఆమె చేసిన ఫొటోషూట్లు, స్టైలిష్ అపియరెన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తాజా ఫొటోలు చూసిన అభిమానులు యంగ్ హీరోయిన్లతో పోటీ పడేలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఆమె హీరోయిన్ గా కూడా బిజీ అవుతోంది. నందమూరి బాలకృష్ణ సరసన నటించే కొత్త చిత్రం (NBK111)తో పాటు మరికొన్ని ప్రాజెక్టులను కాజల్ ఒప్పుకుంటోంది. అయితే ఆమె కేవలం భార్య పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.
ఇటీవలి ఫొటోషూట్లు, గ్లామరస్ లుక్స్ చూస్తే ఇప్పటికీ కమర్షియల్ సినిమాల్లో పూర్తి స్థాయి గ్లామర్ పాత్రలు చేయగలననే సందేశాన్ని దర్శక నిర్మాతలకు కాజల్ పంపుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి, కాజల్ అగర్వాల్ గ్లామర్ పాత్రలను ఇంకా సమర్థంగా పోషించగలనని విషయాన్ని మరోసారి చాటుతోంది.
