Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Nayanthara: మళ్లీ నయన యాక్షన్ మోడ్!

TeluguCinema, May 27, 2026May 27, 2026
Nayanthara

షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది నయనతార (Nayanthara). ఆ సినిమాలో తన స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో అందరినీ మెప్పించిన ఆమె, ఇప్పుడు సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రంలో కూడా యాక్షన్ లుక్ లో కనిపించనుంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో నయనతార కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కీలకమైన ఎపిసోడ్ లో యాక్షన్ మోడ్ లో కూడా కనిపించబోతోందంట.

దీనికి సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిపుణుల సమక్షంలో నయనతారపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారట. త్వరలోనే మరో షెడ్యూల్ లో నయనతారపై ఈ ఎపిసోడ్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది.

షూటింగ్ సెట్స్‌లో సల్మాన్, నయనతారల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, కుల్దీప్ రాథోడ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 2027 రంజాన్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుధ్, తమన్ కలిసి వర్క్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!

Recent News

  • జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు Kannappa
  • Dia Mirza: మగస్వామ్యంపై కామెంట్లకు కట్టుబడి ఉన్నా!
  • Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Nani: ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది
  • Preity Mukhundhan: శర్వానంద్ సరసన ‘బ్లాస్ట్’ భామ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes