
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది ‘దేవి’ (Devi) సినిమా. ఎమ్మెస్ రాజు నిర్మాత. అప్పట్లో ఆ సినిమా గ్రాఫిక్స్ కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఆ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
‘దేవి’ సినిమా కథను అందరికంటే ముందు చిరంజీవి విన్నారంట. ఆ టైమ్ లో ఆయన సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నారంట. ఓ హోటల్ కు చిరంజీవి వచ్చారు. తన కుటుంబం కోసం అక్కడాయన ఎదురుచూస్తున్న టైమ్ లో ఎమ్మెస్ రాజు వెళ్లి కలిశారంట.
ఆ గ్యాప్ లో ‘దేవి’ సినిమా స్టోరీని చిరంజీవికి చెప్పారంట రాజు. కథతో పాటు గ్రాఫిక్స్ కూడా వివరించారంట. మొత్తం విని, చిరంజీవి కొన్ని సలహాలిచ్చారంట. బడ్జెట్ పరంగా చిరంజీవి ఇచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని అన్నారు ఎమ్మెస్ రాజు.
ఆ తర్వాత ఆ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. సిజు, ప్రేమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు.
