Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Peddi: దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా

TeluguCinema, June 14, 2026June 14, 2026
Devara and Peddi

పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఉత్తర అమెరికాలో 3.2 మిలియన్ వసూళ్లు అందుకొంది.

రెండో వీకెండ్ ముగిసే సరికి “పెద్ది” 3.4 మిలియన్ వసూళ్లు సాధించగలదు. ఆ తర్వాత ఎంత రాబడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం. ఐతే, పది రోజుల తర్వాత కూడా ఈ సినిమా ఎన్టీఆర్ నటించిన “దేవర” (Devara) మొదటి రోజు వసూళ్లను రాబట్టలేకపోవడమే పెద్ద సమస్య.

దేవర మొదటి రోజు (ప్రీమియర్ ప్లస్ ఫస్ట్ డే) వసూళ్లు కలిసి 3.7 మిలియన్ డాలర్లు. ఓవరాల్ గా ఈ సినిమా 6 మిలియన్ డాలర్లను రాబట్టుకొంది. ప్రీమియర్ షోలు, మర్నాడు అంటే మొదటి రోజు మొత్తంగా 3.7 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇంత కూడా “పెద్ది” ఇప్పటివరకు పొందలేకపోయింది.

Film Day 1 Gross (Premieres + First Day) Lifetime Gross
Peddi $1.90M $3.30M* (still running)
Devara $3.73M $6.01M

*Peddi is still running in theaters.

అందుకే ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని వెక్కరిస్తున్నారు. మొత్తం రన్ ముగిసే సరికి “పెద్ది” చిత్రం దేవర మొదటి రోజు వసూళ్లను దాటగలదా అని ప్రశ్నిస్తున్నారు.

ఐతే, “దేవర” అంత వసూళ్లు అందుకున్నా ఆ తర్వాత ఎన్టీఆర్ తన బాలీవుడ్ చిత్రంతో చతికిలపడ్డాడు. “వార్ 2” అమెరికాలో 3.8 మిలియన్ వసూళ్లను మాత్రమే అందుకొంది. “దేవర” క్రేజ్ “వార్ 2″కి కలిసి రాలేదు కదా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. సరైన సినిమా పడితే రామ్ చరణ్ కూడా పది మిలియన్ వసూళ్లు కొట్టగలడు అని అంటున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
  • Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్
  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes