
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ రూమర్ నిజమైతే కనుక, కెరీర్ లో తొలిసారి పోలీస్ గా కనిపించనుంది సాయిపల్లవి.
ధనుష్ తన 55వ చిత్రం చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాలోనే ఆమె పోలీస్ గా కనిపిస్తుందనే కొత్త రూమర్ ఊపందుకుంది. ఇది నిజం అవ్వాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఇంతకుముందు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘అమరన్’ సినిమా చేసింది సాయిపల్లవి. ఈసారి ఆమె కోసం పోలీస్ పాత్రను సిద్ధం చేశాడట ఈ దర్శకుడు. ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.
వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వయంగా ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్.
