
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ చిత్రాల షూటింగ్ లను కూడా హైదరాబాద్ చుట్టూ పక్కల ఎక్కువగా తీస్తున్నాడు. ఇక, తెలుగు సినిమాలు కూడా ఎక్కువే చేస్తున్నాడు.
ఇప్పటికే పూజ హెగ్డేతో కలిసి ఒక తెలుగు సినిమా (DQ41) కీలక షూటింగ్ భాగం పూర్తి చేశాడు. తాజాగా “ఆకాశంలో ఒక తార” (Aakasam Lo Oka Tara) అనే మరో తెలుగు చిత్రం షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి భాగం హైదరాబాద్ లో కొనసాగుతోంది. పవన్ సాధినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఇది.
దుల్కర్ కి “సీతారామం,”, “మహానటి” చిత్రాలతో తెలుగులో క్రేజ్ వచ్చింది. “లక్కీ భాస్కర్” పెద్ద హిట్ అయింది. దాంతో, వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరో రెండు కొత్త సినిమాలకి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఏడాదికి ఒక తెలుగు సినిమానైనా చెయ్యాలి అనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
