Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj

TeluguCinema Team, June 6, 2026June 6, 2026

పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా ప్రస్తావించకుండా, తనదైన శైలిలో స్పందించింది అనసూయ (Anasuya Bharadwaj). సినిమాల వల్ల సమాజం మారదని, సినిమాల ద్వారా పిల్లల పెంపకం జరగదని ఆమె అంటోంది.

“సినిమా అనేది ఎప్పుడూ సమాజానికి అద్దంలాంటిదే. అయితే సమాజాన్ని మార్చడం, ప్రజలకు నీతి బోధించడం వంటి మొత్తం బాధ్యతను సినిమాలపై మాత్రమే మోపడం సరైంది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా అనేది ప్రధానంగా ఒక కల్పిత కళారూపం. ఏది సరైనది, ఏది తప్పు అనేది గుర్తించే బాధ్యత ప్రతి వ్యక్తికీ ఉంటుంది. పిల్లలను పెంచడం లేదా విలువలు నేర్పడం పూర్తిగా సినిమాల పని కాదు.”

అదే సమయంలో, సినిమాలకు ఎలాంటి బాధ్యత లేదని కూడా తాను అనుకోవడం లేదంటోంది అనసూయ. సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమమని… అది ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను, చర్చలను ప్రభావితం చేస్తుందంటోంది. కొన్నిసార్లు మనుషుల ప్రవర్తనను కూడా ప్రభావితం చేసే శక్తి సినిమాలకు ఉందంటోందామె.

తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన ఆలోచనలు సృజనాత్మకతకు అడ్డుగా మారుతున్నాయనే విమర్శలు కూడా వచ్చాయని చెప్పుకొచ్చింది అనసూయ. అయినప్పటికీ తన నమ్మిన సిద్దాంతాల నుంచి వెనక్కు వెళ్లలేదంటోంది.

స్వేచ్ఛ, బాధ్యత రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని, అవి కలిసి సహజీవనం చేస్తాయని చెప్పుకొచ్చింది అనసూయ. నువ్వెందుకు ఇవన్నీ చెబుతున్నావో మాకు తెలుసని కొంతమంది పోస్టులు పెడుతుంటే.. విషయాన్ని సూటిగా చెప్పుచ్చుకదా అని మరికొందరు అనసూయ పోస్టుపై స్పందిస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

Recent News

  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes