
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని చవిచూసింది.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ ఆమె మరిన్ని వివరాలు బయటపెట్టింది.
గతంలో ఆమెకు బ్రెయిన్ నర్వ్ బరస్ట్ అయింది అంట. మెదడులోని నరం చిట్లిపోవడం అన్నమాట. దీంతో తన తలలో తొమ్మిది టైటానియం వైర్లను అమర్చి అత్యవసర సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె బయటపెట్టింది.
ఆ ఒక్క సంఘటన ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అయితే, అసలు నరకం ఆ సర్జరీ పూర్తయిన తర్వాతే మొదలైందని ముమైత్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆపరేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తనను తీవ్రంగా బాధించాయని, తరచుగా ఫిట్స్ రావడం, భరించలేని మైగ్రేన్ తలనొప్పితో తాను నరకయాతన అనుభవించానని ఆమె గుర్తు చేసింది.
ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు హెవీగా మందులు వాడింది. దీంతో ఆమె శారీరక స్థితి తో పాటు మానసిక స్థితి కూడా దారుణంగా మారిపోయింది. ఆ మందుల ప్రభావం వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి జారుకున్నానని, అది తాను కావాలని ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చిన సమస్య కాదని ఆమె స్పష్టం చేశారు.
కానీ, తనలోని పోరాట పటిమను ముమైత్ చావనివ్వలేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమేనని తనకు తాను సర్దిచెప్పుకుంటూ, జీవితంలో మళ్ళీ నిలబడింది.
