
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన “ఓజీ” (OG) చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు “OG యూనివర్స్”ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు పవన్ కళ్యాణ్, సుజీత్.
ఓజీ 2 చిత్రం స్టార్ట్ అవుతుందట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారా, సుజీత్ డైరెక్ట్ చేస్తారా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఈ యూనివర్స్ లో కథ రూపొందించి గంభీర పాత్ర జపాన్ లో ఏమి చేశాడు అనే ప్రీక్వెల్ తో మరో దర్శకుడు, మరో హీరోతో సినిమా మొదలు పెడుతారా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఎందుకంటే తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా OG Universe అనే హంగామా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ డైరెక్టర్ గా “OG 2” అని చెప్పడం లేదు. పోనీ ఒకవేళ వీరి కాంబినేషన్ లోనే సినిమా అనుకున్నా, సుజీత్ తాను నానితో తీయాలనుకుంటున్న “బ్లడీ రోమియో” తర్వాత మొదలుపెడుతాడా లేక ముందా అన్న క్లారిటీ లేదు.
నాని క్యాంప్ మాత్రం సుజిత్ తో తమ సినిమా “బ్లడీ రోమియో” అక్టోబర్ నుంచి మొదలవుతుంది అని చెప్తోంది. ఈ OG Universe హంగామా ఏంటో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
