
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో ‘మ్యాడ్’ చిత్రంలో నటించింది. తమిళంలో మాత్రం రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేసింది. తెలుగులో కన్నా తమిళ్ లో ఆమెకి ఎక్కువ గుర్తింపు ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా బిజీ అవ్వాలని భావిస్తోంది. “చెన్నై లవ్ స్టోరీ” (Chennai Love Story) ఆమె దిశ మార్చేలా ఉంది.
ఈ నెల 24 విడుదల కాబోతున్న సినిమాలో ఆమెని డ్రింకర్ గా చూపిస్తున్నారు. సాధారణంగా హీరోలను తాగుడికి అలవాటు పడిన వారీగా చూపిస్తారు. ఈ సినిమాలో డిఫరెంట్.
ట్రైలర్ చూస్తుంటే ఆమెకి నటనకు స్కోప్ ఉండే పాత్రలా కనిపిస్తుంది. అలాగే యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమాతో ఈ తెలుగు భామకి తెలుగు కెరీర్ స్థిరపడుతుందా?
ఈ సినిమా సక్సెస్ కావడం ఆమెకి ముఖ్యం. తమిళ్ లో ‘లవర్’ వంటి సినిమాల్లో బోల్డ్ గానే నటించింది కిస్ సీన్లు సహా. తెలుగులో మాత్రం ఆమెకి ఇది కీలకం.
