
బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు టెలివిజన్ రంగంలో ఉన్నప్పటికీ, వెండితెర హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అందాలు ఆరబోస్తుంది ఈ యాంకర్.
అడపాదడపా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్షిణి, తాజాగా కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. అవి కాస్తా ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.
సముద్ర తీరంలో ఆమె చేసిన ఈ సరికొత్త ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో వర్షిణి ధరించిన అవుట్‌ఫిట్ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేసేలా ఉంది. బికినీపై తెలుపు రంగు నెట్టెడ్ టాప్ వేసింది. అలా కనిపించీ కనిపించని అందాలతో పిచ్చెక్కించింది.
ఈ ఫోటోషూట్‌లో వర్షిణి కనబరిచిన ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. బీచ్ ఒడ్డున ఇసుకలో కూర్చొని, ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్ అయ్యేలా అనిపించే పోజులతో, అందర్నీ కట్టిపడేసింది. ఆమె హావభావాలు, చూడచక్కని ఫిజిక్.. ఫోటోలకు మరింత క్లాస్ లుక్‌ని తీసుకువచ్చాయి.
