Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు

TeluguCinema, June 11, 2026June 11, 2026
Allu Arjun

మొట్టమొదటి ‘ఫార్చ్యూన్ ఇండియా-ఇంటర్‌బ్రాండ్ అత్యంత విలువైన సెలబ్రిటీల’ (India’s Most Valuable Celebrities) జాబితాలో సౌత్ నుంచి ఒకే ఒక్కడికి స్థానం దక్కింది. అతడే అల్లు అర్జున్ (Allu Arjun).

దక్షిణాది నుంచి చాలామంది సెలబ్రిటీలు యాడ్స్ చేస్తున్నప్పటికీ, మరీ ముఖ్యంగా మహేష్ బాబు లాంటి నటులు యాడ్స్ లో దూసుకుపోతున్నప్పటికీ, అత్యంత విలువైన, క్రెడిబిలిటీ కలిగిన సెలబ్రిటీగా టాప్-10లో బన్నీకి మాత్రమే చోటు దక్కడం విశేషం. 

ఇంటర్‌ బ్రాండ్ భాగస్వామ్యంతో ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాను కొన్ని అంశాల ఆధారంగా తయారుచేశారు. నటీనటుల ఎంగేజ్ మెంట్, వాళ్లకు ఉన్న ఆదరణ, విశ్వసనీయత, వాళ్ల విలక్షణత, ఓవరాల్ గా మార్కెట్ పై వాళ్ల చూపించిన ప్రభావం ఆధారంగా జాబితాను తయారు చేశారు. ఇందులో మహేష్ కంటే బన్నీకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. అంతేకాదు, ఏకంగా టాప్-10లో చోటు దక్కింది.

రూ. 1,522 కోట్లు బ్రాండ్ విలువతో జాబితాలో పదో స్థానంలో నిలిచాడు బన్నీ.

ఈ టాప్ 10 జాబితాలో విరాట్ కోహ్లి, రూ.3542 కోట్లుతో మొదటి స్థానంలో నిలవగా.. షారూక్ (రూ.3017) రెండో స్థానంలో, ప్రియాంక చోప్రా (రూ.2507) మూడో స్థానంలో నిలిచారు. 

ఇక ఐదో స్థానంలో రణ్వీర్ సింగ్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. పుష్ప-1, పుష్ప-2 సినిమాలతో దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న అల్లు అర్జున్ మాత్రమే టాప్-10లో చోటు సంపాదించుకోగలిగాడు. 

ఇక జాబితాలో 11వ స్థానంలో దీపిక పదుకోన్ నిలవగా, 17వ స్థానంలో రష్మిక, 25వ స్థానంలో నయనతార నిలిచారు. లిస్టులో సినిమా సెలబ్రిటీల కంటే, క్రికెటర్లకే ఎక్కువ స్థానాలు దక్కాయి.

# Celebrity Brand Value (Rs Cr)
1 Virat Kohli 3,542
2 Shah Rukh Khan 3,017
3 Priyanka Chopra 2,507
4 M.S. Dhoni 2,141
5 Ranveer Singh 2,077
6 Akshay Kumar 2,064
7 Amitabh Bachchan 1,933
8 Sachin Tendulkar 1,676
9 Alia Bhatt 1,606
10 Allu Arjun 1,522

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

Recent News

  • Konidela Surekha ఒక్కసారైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా?
  • ఆ 15 నిమిషాల కోసం Nagabandham చేశాడంట!
  • Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత
  • Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes