
‘నాగబంధం’ (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో, అందులో విజువల్స్ చూసి అంతా షాక్ అయ్యారు. అద్భుతమైన సీజీ వర్క్ తో, యాక్షన్ తో వస్తున్న ఈ సినిమా మెల్లమెల్లగా అంచనాలు పెంచుతోంది.
ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా నటించిన విరాట్ కర్ణ (Virat Karna) స్పందించాడు. ‘నాగబంధం’ సినిమాలో కేవలం ఆ 15 నిమిషాల ఎపిసోడ్ కోసం ఈ సినిమా ఒప్పుకున్న విషయాన్ని బయటపెట్టాడు.
“నాగబంధం ఇంటర్వెల్ ఎక్స్ టార్డినరీగా ఉంటుంది. గ్రాఫిక్స్, ఫైట్స్, గ్రాండియర్ అంతా నెక్ట్స్ లెవెల్ లో ఉంది. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి అదే మెయిన్ రీజన్. ఇంటర్వెల్ లో ఆ 15 నిమిషాలు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూమెంట్ ఉంటుంది. ఆ 15 నిమిషాల ఎపిసోడ్ నుంచే సినిమా మరో లెవెల్ కు వెళ్తుంది.”
ఇందులో శివుడి పాత్ర పోషించాడు విరాట్ కర్ణ. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి బలమైన పాత్ర రావడంతో తననుతాను నిరూపించుకోవాలనే కసితో ఈ సినిమా చేశాడంట విరాట్. కొన్ని సందర్భాల్లో దర్శకుడు చెప్పినా వినకుండా, డూప్ లేకుండా నటించాడంట. ఒక దశలో హై-ఫీవర్ లో కూడా సినిమా చేశాడంట. 3వ తేదీన థియేటర్లలోకి వస్తోంది నాగబంధం.
