
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది చిత్రసీమను వెనకేసుకొచ్చిది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).
దక్షిణాది చిత్ర పరిశ్రమ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రొఫెషనలిజం విషయంలో సౌత్ సినిమా చాలా ముందుంటుందని, మిగతా ఇండస్ట్రీల కంటే ఇక్కడి పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుందని అంటోంది కాజల్.
దక్షిణాది పరిశ్రమల్లో కనిపించే క్రమశిక్షణ, సమయపాలన, పక్కా ప్రణాళిక నటీనటులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతోంది కాజల్. ఈ వృత్తిపరమైన అంకితభావమే ఇక్కడి సినిమాలను ఒక నిర్దిష్టమైన నాణ్యతతో, అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
కేవలం పనితీరులోనే కాకుండా సృజనాత్మకత, సాంకేతిక విలువల్లోనూ దక్షిణాది సినిమా అత్యున్నత స్థాయిలో ఉందని కాజల్ మెచ్చుకుంది. ఇక్కడ మంచి టెక్నీషియన్లు, టాలెంట్ ఉన్న దర్శకులు ఉన్నారని అంటోంది. విభిన్నమైన కథాంశాలతో, మూస ధోరణులను బ్రేక్ చేస్తూ దర్శకులు ప్రయోగాలు చేస్తున్న తీరు బాగుందని మెచ్చుకుంది.
భావోద్వేగాలతో పాటు విజువల్స్ పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధ కారణంగానే సౌత్ సినిమాలు ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయని అభిప్రాయపడింది కాజల్. ప్రస్తుతం ఆమె తెలుగులో రీఎంట్రీకి రెడీ అవుతోంది. బాలయ్య సినిమాలో నటించబోతోంది.
