
‘పెద్ది’ (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా చూపించారనేది విమర్శ. హీరోయిన్ పాత్రను మరీ ఓ వస్తువులా చూపించారనేది అతిపెద్ద సమస్య.
దీనిపై ఇప్పటికే డింపుల్ హయాతీ, అషికా రంగనాధ్ లాంటి హీరోయిన్లు స్పందించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నిత్యా మీనన్ (Nithya Menen) కూడా చేరిపోయింది. ఆమె ‘పెద్ది’ చూడలేదు. అయినా స్పందించింది.
“నేను ‘పెద్ది’ సినిమా చూడలేదు. అందులో జాన్వి కపూర్ ఎలా ఉందో నాకు తెలియదు. అయినా మహిళా ఆర్టిస్టులపై నేను స్పందిస్తున్నాను. మహిళల్ని తెరపై వస్తువుల్లా చూపించడం తప్పు. ఈ విషయంలో మహిళా ఆర్టిస్టులంతా హద్దులు గీసుకోవాలి. ఇష్టంలేకపోతే ధైర్యంగా నో చెప్పాలి.”
నటీనటులు ఎవరికి వారు తమ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చంటోంది నిత్యా. ఒక కళాకారిణి ప్రయాణంలో వ్యక్తిగత హద్దులు పెట్టుకోవడం చాలా ముఖ్యమని, తన వరకు వస్తే, ఎలాంటి పాత్రలు చేయాలి, ఏవి చేయకూడదు అనే విషయంలో మొదటి నుంచీ తను చాలా స్పష్టతతో ఉన్నానని ఆమె గుర్తు చేసింది.
ఏళ్ల తరబడి ఒకే రకమైన కమర్షియల్ సినిమాలు, పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత అకస్మాత్తుగా వాటిపై అభ్యంతరం చెబితే, ఎవ్వరూ పట్టించుకోరని, అందుకే నటీమణులు కెరీర్ ప్రారంభం నుంచే బౌండరీస్ గీసుకోవాలని సూచిస్తోంది నిత్యామీనన్.
