
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పుకారు వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది కూడా అలాంటిదే. అల్లు అర్జున్ (Allu Arjun), లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో రావాల్సిన భారీ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. 2 రోజులుగా నడుస్తున్న ఈ ప్రచారానికి పరోక్షంగా ఫుల్ స్టాప్ పడింది.
రచయిత రత్నకుమార్ తాజాగా ఈ పుకార్లకు చెక్ పెడుతూ ‘#AA23’ ప్రాజెక్ట్ ఇంకా లైన్‌లోనే ఉందని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఆయన నేరుగా ఈ రూమర్లపై స్పందించలేదు.
‘విక్రమ్’ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్ వేశాడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. దీనికి రత్నకుమార్ స్పందించాడు.
లోకేష్‌ను అభినందిస్తూ, తాను ‘AA23’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. అతడి స్పందనతో బన్నీ-లోకేశ్ సినిమా ఆగిపోలేదనే విషయంపై క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా ప్రకటనలో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా దీనికి అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుర్రాళ్లకు ఎక్కేసింది. ఎంతోమంది తమ రింగ్ టోన్స్ గా దీన్ని పెట్టుకున్నారు. ఓ తమిళ నవల ఆధారంగా ఈ సినిమా రానుందనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
