
నాని (Nani) ప్రస్తుతం చేస్తున్న చిత్రం…ది ప్యారడైజ్(The Paradise) . ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టులో విడుదల చెయ్యాలనే ప్లానింగ్ తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కష్టపడుతున్నారు. అది ఆగస్టుకి వస్తుందా రాదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ నాని, ఓదెల డేడికేటెడ్ గా పనిచేస్తున్నారు.
“ది ప్యారడైజ్” విడుదలైన వెంటనే దర్శకుడు సుజిత్ తీసే “బ్లడీ రోమియో” షూటింగ్ తో బిజీ అయిపోతాడు. ఈ సినిమాని ఇప్పటికే లాంచ్ చేశారు. సో, వచ్చే ఏడాది వరకు నానికి ఖాళి లేదు కానీ అప్పుడే నాని చేసే తదుపరి చిత్రం ఇదే అంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఇటీవల “బ్యాండ్ మేళం” అనే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడు సతీష్ జవ్వాజి చెప్పిన కథ నానికి నచ్చింది అని, నాని అతనికి ఓకే చెప్పాడని ప్రచారం మొదలైంది.
ఈ సినిమాని ‘కోర్టు’ సినిమా తీసిన వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది అని, నాని సమర్పిస్తారు అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అలెర్ట్ అయిన నిర్మాణ సంస్థ ఇదంతా అబద్దమని పేర్కొంది.
నాని ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఆయన మార్కెట్ భారీగా పెరిగింది. మిడ్ రేంజ్ హీరోల్లో నాని టాప్ ప్లేస్ లో ఉన్నారు. అందుకే, నాని సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు.
